Namaste NRI

అదే తెలుగు పరిశ్రమ గొప్పతనం

ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ షణ్ముఖ. షణ్ముగం సాప్పని దర్శకుడు. ఈ చిత్రం   ప్రీరిలీజ్ వేడుకను ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో రఘునందన్రావు మాట్లాడుతూ  దేశ భాషల్లో తెలుగు గొప్పది. ఎంతోమంది ఇతర భాషలకు చెందిన నటులు ఇక్కడ రాణిస్తున్నారు. వాళ్లని అదే స్థాయిలో స్వీకరిస్తున్నాం. అదే తెలుగు పరిశ్రమ గొప్పతనం అన్నారు. ఆది కెరీర్ని మలుపు తిప్పే సినిమా కావాలని కోరుకుంటున్నా. గొప్ప నటుడు సాయికుమార్ వారసుడిగా ఆదికి మంచి పేరు ఉంది. ఈ చిత్రం విజయవంతమై, అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నా అన్నారు.

 చాలా మంది టైటిల్ పాజిటివ్గా ఉందని చెప్పారని, ప్రేక్షకులకు విభిన్న కథా చిత్రాన్ని చూసిన అనుభూతిని మిగుల్చుతుందని హీరో ఆది సాయికుమార్ తెలిపారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదని, ఫ్యామిలీ అంతా కలిసి చూసే డివోషనల్ థ్రిల్లర్గా మెప్పిస్తుందని, రవి బస్రూర్ సంగీతం హైలైట్గా నిలుస్తుందని దర్శకుడు షణ్ముగం సాప్పని అన్నారు.  ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: తులసీరామ్, షణ్ముగం, రమేష్ యాదవ్, దర్శకత్వం: షణ్ముగం సాప్పని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]