Namaste NRI

మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చార్రోయ్ సాంగ్ రిలీజ్

బ్లాక్‌ బస్టర్‌ మ్యాడ్‌ కి సీక్వెల్‌గా మ్యాడ్‌ స్కేర్‌  సినిమా వస్తున్నది అనగానే సినిమాపై అంచనాలు ఆకాశంలో కూర్చున్నాయి. దీనికి తగ్గట్టే ఇటీవలే విడుదలైన టీజర్‌ కూడా విశేషంగా ఆకట్టుకున్నది. ఇప్పటికే విడుదలైన లడ్డు గానీ పెళ్లి, స్వాతిరెడ్డి పాటలు కూడా జన బాహుళ్యంలో బాగా వినిపిస్తున్నాయి. తాజాగా మూడో పాటను మేకర్స్‌ విడుదల చేశారు. వచ్చార్రోయ్‌ అంటూ సాగే ఈ పాటను కె.వి.అనుదీప్‌ రాయగా, భీమ్స్‌ స్వరపరిచి స్వయంగా ఆలపించారు. ఏసుకోండ్రా మీమ్స్‌ చేసుకోండ్రా రీల్స్‌  రాసుకోండ్రా హెడ్‌ లైన్స్‌  ఇది మ్యాడ్‌ కాదు మ్యాడ్‌ మ్యాక్స్‌  వంటి పంక్తులతో అందరూ పాడుకునేలా ఈ పాట సాగింది.

ప్రధాన పాత్రధారులు నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ త్రయం ఈ పాటలో ఓ రేంజ్‌లో అల్లరి చేశారు. ఆసక్తికరమైన కథనంతో కడుపు చెక్కలు చేసి హాస్య సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుందని దర్శకుడు కల్యాణ్‌శంకర్‌ చెబుతున్నారు. ప్రియాంక జవాల్కర్‌, మురళీధర్‌ గౌడ్‌, కె.వి.అనుదీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రెబా మోనికా జాన్‌ ప్రత్యేకగీతంలో సందడి చేశారు. ఈ నెల 28న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: శామ్‌దత్‌ ఐఎస్‌సీ, సమర్పణ: సూర్యదేవర నాగవంశీ, నిర్మాత: హారిక సూర్యదేవర, సాయిసౌజన్య, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్‌ అండ్‌ ఫార్చూన్‌ఫోర్‌ సినిమాస్‌, శ్రీకరా స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]