
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారని అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్ ఇంధన, శక్తి వనరుల మౌలిక వసతులపై 30 రోజులపాటు పాక్షిక కాల్పుల విరమణ పాటించేందుకు పుతిన్ సమ్మతి తెలిపారని పేర్కొన్నది. డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య దాదాపు రెండు గంటలకుపైగా సాగిన ఫోన్ సంభాషణ అనంతరం వైట్‌హౌజ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
