
సుశాంత్ కథానాయకుడిగా ఓ మిస్టరీ థ్రిల్లర్ రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా ఆయన కెరీర్‌లో 10వ సినిమా కావడం విశేషం. మంగళవారం సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పోస్టర్‌ని విడుదల చేస్తూ కొత్త సినిమా వివరాల్ని వెల్లడించింది చిత్రబృందం. పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో వరుణ్‌కుమార్, రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెండు డిఫరెంట్ లుక్స్‌తో ైస్టెలిష్‌గా సుశాంత్ కనిపిస్తున్నారు. పోస్టర్ డిజైన్ చేసిన తీరును బట్టి ఇది మిస్టరీ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తున్నది. భీతిగొలిపే కారుచీకటి, గుడ్లగూబలు, రాబందులు.. పుర్రెలు, వీటిమధ్య సీరియస్‌గా చూస్తూ సుశాంత్ ఆయన్నే చూస్తూ ఓ నల్ల పిల్లి, ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే: అనిరుధ్ కృష్ణమూర్తి, కెమెరా: వైవిబీ శివసాగర్, నిర్మాణం: సంజీవని క్రియేషన్స్.
