Namaste NRI

ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి : రాహుల్‌రెడ్డి

హర్ష రోషన్‌, కార్తికేయ, దేవ్‌, స్టీవెన్‌ మధు, సాన్వీ మేఘన, నిహాల్‌ కోదాటి ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం టుక్‌ టుక్‌. సి.సుప్రీత్‌కృష్ణ దర్శకుడు. రాహుల్‌రెడ్డి, లోక్కు శ్రీవరణ్‌, శ్రీరాములరెడ్డి నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఓ వెహికల్‌లో ఓ సోల్‌ ఆ వెహికల్‌కు ఓ బ్యాక్‌ స్టోరీ ఈ కాన్సెప్ట్‌లోనే ఓ కొత్తదనం ఉంది. తప్పకుండా అందరికీ నచ్చుతుందనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్‌ని ఫ్రాంచైజీగా, యూనివర్సల్‌గా బిల్డ్‌ చేయాలనుంది అని దర్శకుడు సుప్రీత్‌కృష్ణ అన్నారు. ఫాంటసీ థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని నిర్మాత రాహుల్‌రెడ్డి తెలిపారు. ఇంకా ప్రధాన పాత్రధారులు నిహాల్‌ కోదాటి, శాన్వీ మేఘన కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]