జపాన్ ప్రధానిగా మాజీ దౌత్యవేత్త పుమియో కిషిదాను దేశ పార్లమెంటు ఎన్నుకుంది. ప్రతిపక్ష పార్టీ కాన్స్టిట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ అధినేత యూకియో ఇడానోపై ఆయన భారీ మెజార్టీతో గెలుపోందారు. కరోనా, చైనా, ఉత్తర కొరియా నుంచి భద్రత సవాళ్లు వంటి పలు సమస్యలతో కుదేలైన జపాన్ను ఆయన చక్కదిద్దాల్సి ఉంది. ఏడాది క్రితం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన యూషిహిడే సుగా ఇటీవల పదవి నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)