యూఏఈలోని భారతీయుడిని అదృష్టం వరించింది. హైపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న 40 మంది బృందానికి రూ.20.26 కోట్ల విలువైన లాటరీ తగిలింది. వీరిలో ఇద్దరు బంగ్లాదేశీయులు కాగా మిగిలిన అందరూ భారతీయులే. ఒకే గదిలో నివసిస్తున్న వీరందరూ కలిసి కేరళకు చెందిన నహీల్ నిజామూద్దీన్ పేరుతో యూఏఈలో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. కరోనా నేపథ్యంలో నహీల్ నిజాముద్దీన్‌ను స్వదేశానికి తిప్పి పంపించారు. దీంతో లాటరీ నిర్వాహకులు నహీల్‌ను సంప్రదించకపోకపోయారని తెలిసింది. నహీల్ ఇచ్చిన తల్లిదండ్రుల ఫోన్ నంబరు ఆధారంగా లాటరీ గెల్చుకున్న విషయాన్ని నిర్వాహకులు తెలియజేశారని పేర్కొంది. లాటరీ ద్వారా లభించిన మొత్తాన్ని 40 మంది పంంచుకోనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)