Skip to main content

Namaste NRI

ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర… జాక్‌

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జాక్‌-కొంచెం క్రాక్‌. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ  చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా  బొమ్మరిల్లు భాస్కర్‌ మాట్లాడారు. సిద్ధులాంటి నటుడితో పనిచేయడం ఏ దర్శకుడికైనా సులభంగా ఉంటుంది. ప్రతీ సీన్‌లో అద్భుతంగా నటిస్తాడు. ఈ సినిమా విషయంలో రైటింగ్‌ స్టేజీ నుంచే సిద్ధు బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యాడు. జాక్‌ క్యారెక్టరైజేషన్‌, డైలాగ్‌ మాడ్యులేషన్‌లో సిద్ధుకే స్వేచ్ఛనిచ్చాను అన్నారు.  మనలో ప్రతీ ఒక్కరిలో జాక్‌ ఉంటాడని, ఆ జాక్‌ ఎవరనేది ఎవరికి వాళ్లే తెలుసుకోవాలని, ఈ సినిమాలో భావోద్వేగాలతో పాటు చక్కటి సందేశం ఉంటుందని అన్నారు.

టిల్లు ఏ మీటర్‌లో ఉంటుందో అంతకు మించి జాక్‌ పాత్ర ఉంటుందని, ఇంటర్వెల్‌లో వచ్చే చార్మినార్‌ ఎపిసోడ్‌ ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో ఉంటుందని, కథలోని ట్విస్టులు ఉత్కంఠను పంచుతాయని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. బొమ్మరిల్లు భాస్కర్‌ వంటి గొప్ప దర్శకుడితో పనిచేయడం ఆనందంగా ఉందని, సిద్ధు నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని కథానాయిక వైష్ణవి చైతన్య చెప్పింది. భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ తెలిపారు.  ఈ నెల 10న విడుదలకానుంది.  ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, రథన్‌, అచ్చు రాజమణి, రచన-దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్‌.

Social Share Spread Message

Latest News