Skip to main content

Namaste NRI

మా మాట నిలబెట్టుకున్నాం: ప్రదీప్‌ మాచిరాజు

ప్రదీప్‌ మాచిరాజు  కథానాయకుడిగా నటించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. దీపిక పిల్లి కథానాయిక. డుయో నితిన్‌, భరత్‌ కలిసి దర్శకత్వం వహించారు. మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ప్రదీప్‌ మాట్లాడారు.సినిమా విడుదలకు ముందు ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకూ ప్రేక్షకుల పెదవులపై నవ్వు ఉంటుందని ప్రామిస్‌ చేశాను. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాం. థియేటర్లలో ఆడియన్స్‌ నవ్వులు మా కష్టాన్ని మరిపించాయి. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్‌ విడుదల చేయడంతో మా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు అందరూ ప్రాణంపెట్టి పనిచేశారు. ఆ ఫలితం తెరపై కనిపిస్తున్నది. ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని  ప్రదీప్‌ పేర్కొన్నారు. కష్టానికి తగ్గ ఫలితాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని దర్శకుడు అన్నారు. ఇంకా దీపిక పిల్లి, గెటప్‌ శ్రీను, సంగీత దర్శకుడు రధన్‌, మైత్రీ శశిధర్‌రెడ్డి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events