Skip to main content

Namaste NRI

పోలీస్‌ వారి హెచ్చరిక ఆడియో లాంచ్‌

సన్నీ అఖిల్‌, రవికాలె, అజయ్‌ఘోష్‌, షాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పోలీస్‌ వారి హెచ్చరిక. బాజ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లి జనార్ధన్‌ నిర్మాత. హైదరాబాద్‌లో ఈ సినిమా ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. జయసుధ, ఆర్‌.నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ్‌, తనికెళ్ల భరణి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.

చక్కటి సామాజిక సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు బాబ్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిస్ట్‌ నాయకులు కూడా పాల్గొన్నారు. సుభలేఖ సుధాకర్‌, షాయాజీ షిండే, గిద్దేష్‌, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కిషన్‌ సాగర్‌, కొండపల్లి నళినీకాంత్‌, సంగీతం: గజ్వేల్‌ వేణు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events