Skip to main content

Namaste NRI

గుడ్‌ బ్యాడ్‌ అగ్లీతో..  థియేటర్లలో అభిమానుల సంబరాలు

 అజిత్‌ కథానాయకుడు నటించిన బహుభాషా చిత్రం గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 10న పానిండియా స్థాయిలో సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా బ్లాక్‌బస్టర్‌ సంభవం సెలబ్రేషన్స్‌ని హైదరాబాద్‌లో మేకర్స్‌ నిర్వహించారు.

తమ సంస్థ నుంచి వచ్చిన భారీ బ్లాక్‌బస్టర్‌ మూవీ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అని నిర్మాత నవీన్‌ యర్నేని అన్నారు. ఈ సినిమా విజయానికి కారణం టీమ్‌. ఇంత అద్భుతమైన టీమ్‌ దొరకడం దర్శకునికి వరం. నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చిన అజిత్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నా అని దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ పేర్కొన్నారు. ఇంకా నటుడు సునీల్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌, డీవోపీ అభినందన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events