ఉప్పెన తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం కొండపొలం. యాక్షన్ మరియు అడ్వైంచరస్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది.ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ కొండపొలం అందరూ గర్వపడే సినిమా అవుతుందని తెలిపారు. లాక్‌సౌడ్ సమయంలో ఎంతో రిస్క్ తీసుకని ఈ సినిమా చేశాం అన్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఇదొక అద్భుతంగా మిగిలిపోతుంది అని నిర్మాత రాజీవ్ రెడ్డి తెలిపారు. వైష్టవ్‌తేజ్ మాట్లాడుతూ మనలో ఒకడు అన్ని భయాల్ని అధిగమించి ధైర్యంగా నిలబడటం ఏకంగా పులినే ఎదిరించడమే ఈ చిత్ర ఇతివృత్తం. ఎన్నిసార్లు క్రిందపడ్డా ముందుకు వెళ్లాలనే ధైర్యానిస్తుంది అని పేర్కొన్నారు.
కొందరి జీవితాన్ని చూసి ఊహించుకొని ఈ నవల రాశానని తెరపై తన భావనలు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హరీష్‌శంకర్, చంద్రబోస్, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు.