మహీంద్ర ఎక్స్‌యూవీ 700 బుకింగ్స్ ప్రారంభమైన గంటలోనే 25,000 ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి. భారత్‌లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఫోర్ వీలర్‌గా మహీంద్ర ఎక్స్ యూవీ 700 నిలిచింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లలో న్యూ మహీంద్రా ఎక్స్‌యూవీ 700ను మహీంద్ర రూ.11.99 లక్షల (ఎక్స్‌షోరూం, భారత్) ప్రారంభ ధరతో లాంచ్ చేసిందని కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ విజయ్ నక్రా తెలిపారు. గురువారం ఉదయం పది గంటలకు బుకింగ్స్ ఓపెన్ చేయగా కేవలం 57 నిమిషాల్లోనే 25,000 ఎక్స్‌యూవీ 700 బుకింగ్స్ నమోదవడం తమను ఆశ్చర్యానికి లోను చేసిందని తెలిపారు. అటు సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా సంతోషం వ్యక్తం చేశారు. కస్టమర్లకు తమ సంస్థపై ఎంత నమ్మకం ఉందో, తమ భుజాలపై ఎంత బాధ్యత ఉందో దీన్ని చూస్తుంటే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.