తెలుగు రాష్ట్రాల్లోని హెటిరో డ్రగ్స్ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నారు. సంస్థ ముఖ్యుల ఇళ్లలో మాత్రం తనిఖీలు ముగిసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్టు ఐటీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని సనత్‌నగర్ కార్పొరేట్ కార్యాలయంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నక్కలపల్లి, జీడీమెట్ల కార్యాలయాల్లో తనిఖీలు జరిగినట్లు తెలిపారు. ఇప్పటికే రెండు మూడు ప్రాంతాల్లో రూ.100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ నగదుపై ఉన్న బ్యాంకు సీల్‌ను పరిశీలించడంతో పాటు ఆ మొత్తాన్ని ఎప్పుడు డ్రా చేశారు? ఏ బ్యాంకు నుంచి ఎవరు డ్రా చేశారు? తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, దస్త్రాలు పరిశీలన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/china-300x160.jpg)