Namaste NRI

రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ మాస్ మహారాజు ప్రారంభం

రాజ్‌తరుణ్‌, సందీప్‌మాధవ్‌, సిమ్రత్‌కౌర్‌, సంపద నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం మాస్‌ మహారాజు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్‌ క్లాప్‌నివ్వగా, జెమిని కిరణ్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సూర్యచంద్రుల్లాంటి ఇ్దదరు స్నేహితుల కథ ఇది. ఒకరికోసం మరొకరు ఎలాంటి త్యాగం చేశారన్నది ఆసక్తికరంగా ఉంటుంది అని తెలిపారు. వంగవీటి జార్జిరెడ్డి తర్వాత తాను శక్తివంతమైన పాత్రలో నటిస్తున్న చిత్రమిదని సందీప్‌మాధవ్‌ పేర్కొన్నారు. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సరికొత్తగా తన పాత్ర ఉంటుందని రాజ్‌ తరుణ్‌ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. రెండు షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలతో స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది అని అన్నారు. సి. కల్యాణ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. సీహెచ్‌ సుధీర్‌రాజు దర్శకుడు. ఎం.ఆసిఫ్‌జానీ నిర్మాత.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events