తెలంగాణ సంస్కృతి పరిమళించేలా వాడవాడనా బతుకమ్మ వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి పూల పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మీతో కలిసి ఆయన బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా తగ్గిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని అన్నారు. దేవుడికి అర్పించే పూలతో బతుకమ్మ ఆడటం నిజంగా సంతోషదాయకమని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తామని వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)