Namaste NRI

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆహ్వానించిన నాగార్జున 

టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ అక్కినేని ఇంటా మ‌రోసారి పెళ్లిబాజాలు మోగ‌నున్న విష‌యం తెలిసిందే. తాజాగా అత‌డి చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న విష‌యం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరగ‌గా, జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంత‌రం అఖిల్ వివాహ శుభలేఖను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున భ‌ట్టితో కాసేపు ముచ్చ‌టించాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events