మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితం అనంతరం మోహన్ బాబు పలు కీలక కామెంట్స్ చేశారు. మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్, నాగబాబు రాజీనామా చేసిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడుతూ నన్ను రెచ్చగొట్టాలని చాలా మంది చూశారు. సింహం నాలుగడుగులు వెనక్కి వేసిందంటే విజృంభిస్తుంది. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. కొందరు పలు వేదికలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను అసమర్ధుడిని కాను. మౌనంగా ఉన్నా అంతే. నవ్వుతూ స్వీకరించాలి. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి మాకు సాయం చేయాలని అడగాలని సూచించారు. వారికి విజ్ఞప్తి చేస్తే సహకరిస్తారు అని అన్నారు. టీవీలో కనిపించాలని చాలా మంది సినిమా యాక్టర్లకు ఉంటుంది. కళామతల్లిని నమ్మిన వ్యక్తే మా అధ్యక్షుడు కావాలని చెప్పాను. మా లో ఏం జరుగుతుందో అందరూ గమనిస్తున్నారని చెప్పారు. గెలిచిన మా సభ్యులందరికి రేపనేది క్వచ్చన్ మార్కు అని, అందరూ బాధ్యతగా ముందుకెళ్లాలని సూచించారు. సభ్యులకు ఇష్టం వచ్చిన పార్టీలుండొచ్చు. ఇక్కడంతా ఒకే పార్టీ. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని అన్నారు.