అమెరికాకు చెందిన ఆర్థికశాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్, జోషువా డి.ఆంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. కారణం, ప్రభావం అనే సహజ ప్రయోగంపై పరిశోధన చేసినందుకుగాను వారికి ఈ బహుమతి ప్రకటించారు. అయితే బహుమతిలో మొత్తంలో సగం డేవిడ్ కార్డ్‌కు ఇవ్వగా, మిగతా సగాన్ని జోషువా, గైడోలకు పంచారు. బహుమతి కింద బంగారు పతకం, 10 మిలియన్ స్వీడిష్ క్రౌనర్లు ఇస్తారు. సమాజానికి సంబంధించిన ప్రధాన ప్రశ్నలపై డేవిడ్ కార్డ్ అధ్యయనం చేశాడు. కాగా ఆంగ్రిస్ట్, ఇంబెన్స్, మెథడాలజికల్ కంట్రిబ్యూషన్‌పై పరిశోధనలు చేశారు అని ఎకనామిక్ సైన్సెస్ కమిటీ అధ్యక్షుడు పీటర్ ప్రెడిక్సన్ తెలిపారు. సమాజానికి ప్రయోజనం కలిగించే కొన్ని మామాలు ప్రశ్నలకు వారి పరిశోధన తగిన సమాధానాలు ఇవ్వగలిగింది అని కూడా ఆయన పేర్కొన్నారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రదానం చేస్తుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)