మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎదురుచూశారని ఆయన ట్వీట్ చేశారు. ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. అందరికీ అభినందనలు అని పేర్కొన్నారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్ల విజేతలకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడిరచిన మా ఓటర్లకు ధన్యవాదాలు అంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. దేశాన్ని విచ్చిన్నం చేయాలనుకునే గుంపునకు మద్దతు పలికిన వారికి ఇది సరైన గుణపాఠం అని తెలిపారు. ప్రకాష్ రాజ్ ముందు నుండి కూడా బీజేపీకి వ్యతిరేకం అనే సంగతి తెలిసిందే. ఎన్నో సార్లు మోదీ నిర్ణయాల పై వ్యతిరేకించారు. అందుకే ఇప్పుడు సంజయ్ ఇలా ట్వీట్స్ చేడయం జరిగిందని అంత మాట్లాడుకుంటున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)