టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ మూడేండ్లుగా చేస్తున్న సేవలను ప్రశంసనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా శాఖ ప్రారంభించినప్పటి నుంచి పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే, మరోవైపు విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. ముఖ్యమంగా కరోనా సమయంలో దక్షిణాఫ్రికాతో పాటు మిగతా ఆఫ్రికా దేశాల్లోనూ సేవలను విస్తృత పరిచారని అభినందించారు. దక్షిణాఫ్రికాలో ఉన్న తెలుగువారికి రెండు సందర్భాల్లో ఇబ్బంది కలుగగా, తాను తెలియజేయగానే శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు స్పందించి సహాయం అందించారని గుర్తు చేశారు. ఈ శాఖ సభ్యులు ఆర్గాన్ డొనేషన్ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుండడం సంతోషకరమన్నారు. ఆ దేశంలోని తెలంగాణ బిడ్డలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటున్నారని చెప్పారు. పార్టీ ప్రతిష్ఠను మరింత ఇనుమడిరపజేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా టీఆర్‌ఎస్ శాఖకు ఆమె అభినందనలు తెలియజేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)