నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన డిఫెన్స్ ఎగ్జిబిషన్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజేయమైన సైనాన్ని నిర్మిస్తానంటూ కిమ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ దక్షిణ కొరియాతో మేము ఎలాంటి శత్రుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. ఆయుధ సామాగ్రిని కేవలం ఆత్మరక్షణ కోసమే సమకూర్చుకుంటున్నాం. ఎవరితోనూ యుద్ధాలు చేయడానికి కాదు. మేము ఎవరితోనూ యుద్ధం కోరుకోవడం లేదన్నారు. దేశ సార్వభౌమత్వ రక్షణ కోసం ప్రత్యర్థుల్లో భయాన్ని పెంచడంపై మాట్లాడతామని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)