ఇటీవల కొన్ని సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు దాదాపు ఆరు గంటల పాటు నిలిచిపోవడంతో అనేక వదంతులు వ్యాపించాయి. వాట్సాప్‌ను రాత్రి 11:30 నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్ర నిర్ణయించిందని, అలాగే దీన్ని యాక్టివ్ చేసుకోవాలంటే నెలవారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఖండిరచింది. ఇదంతా అబద్ధపు ప్రచారమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీబీఐ) ఫ్యాక్ట్ చెక్ ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. అలాంటి ప్రకటన ఏదీ కేంద్రం చేయలేదని, వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)