టూరిస్ట్ వీసాల విషయమై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు మార్గంలో వచ్చే సందర్శకులకు టూరిస్ట్ వీసాలు ఇవ్వబోమని వెల్లడిరచింది. అంటే మన పొరుగు దేశాలతో పాటు మన దేశ సరిహద్దును పంచుకునే దేశాల నుంచి టూరిస్ట్ వీసాలపై వచ్చేవారు ఈ నిర్ణయం కారణంగా ఇకపై భారత్‌లో అడుగు పెట్టలేరు. రోడ్డుమార్గంలో వచ్చే వారికి టూరిస్ట్ వీసాలు ఇవ్వరు కనుక పొరుగు దేశాల సందర్శకులు వాయువు, సముద్రమార్గంలో భారత్‌కు రావొచ్చు. మన దేశంతో సరిహద్దును పంచుకునే దేశాల జాబితాలో చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, భూటాన్ మయన్నార్ ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు కొత్త గైడెలైన్స్ ప్రకారం టూరిస్ట్ వీసాల కోసం అప్లై చేసుకోవాలి. ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా కొత్త మార్గదర్శకాలను అనుసరించి నూతన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే మొదటి ఐదు లక్షల మందికి ఉచితంగా వీసాలు ఇస్తామని ప్రకటించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)