అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం కొండా. వరంగల్లోని కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమా వరంగల్లోని వంచనగిరిలో పూజా కార్యక్రమాలో లాంచనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ కొండా మురళి చరిత్ర నాకు చాలా నచ్చింది అన్నారు. వారి జీవిత చరిత్రను పదిశాతం సినిమాలో చూపించినా నా ప్రయత్నం విజయవంతం అయినట్టే అన్నారు. నిజజీవితంలో కొండా దంపతులు ఎలా ధైర్యంగా నిలబడ్డారు? అనేది కొండా ద్వారా చూపించబోతున్నాం అన్నారు నిర్మాత ముకుంద్. ఆర్జీవీ మమ్మల్ని గుర్తించి, ముందుకొచ్చి ఈ సినిమా చేస్తానని ధైర్యంగా చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు కొండా సురేఖ. మల్లారెడ్డి, నవీన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా : మల్హర్భట్ జోషి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)