అర్రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోస్టల్ ఉద్యోగులు మరణించారు. మెమ్ఫిస్లోని టెన్నెస్సీ పోస్టాఫీస్‌లో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో యూఎస్ పోస్టల్ సర్వీస్ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా పోస్టల్ ఉద్యోగే అని పోస్టల్ ఇన్స్పెక్టర్ సుసాన్ తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతిన కోసం పోలీసులు గాలిస్తున్నారని వెల్లడిరచారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)