భారతీయ అమెరికన్ మహిళ న్యాయవాది రమ్య జవహర్ కుదెకల్లు (32)కు కీలక పదవి దక్కింది. న్యూయార్క్ సిటీ బార్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్ప్‌ర్సన్‌గా రమ్య ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవికి ఎన్నికైన తొలి శ్వేతజాతి యేతర మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. రమ్య ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. బెంగళూరులోనే పుట్టి పెరిగిన రమ్య విద్యాభ్యాసం ఊటీతో పాటు బెంగళూరులోనే కొనసాగింది. ఆ తర్వాత ఇంటర్నెషనల్ లా అండ్ జస్టిస్‌లో మాస్టర్స్ కోసం న్యూయార్క్ వెళ్లారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లోని కార్డోజో లా స్కూల్ టీచింగ్ చేస్తున్నారు.