మైక్రోసాఫ్ట్ చైనాకు గట్టి షాక్‌ను ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్‌ఇన్ కెరీర్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా తెచ్చిన చట్టాలను కట్టుబడి ఉండటం సవాలుగా మారడంతో లింక్డ్ ఇన్ సేవలను మూసివేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. చైనా జర్నలిస్టుల ప్రోఫైళ్లను మైక్రోసాఫ్ట్ బ్లాక్ చేసింది. లింక్డ్ ఇన్ సేవలను నిలిపివేసినప్పటికీ చైనా మార్కెట్లను వదిలిపెట్టడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా లేనట్లు కనిప్తోంది. లింక్డ్ ఇన్ స్థానంలో ఇన్‌జాబ్స్‌ను త్వరలోనే మైక్రోసాఫ్ట్ లాంచ్ చేయనుంది. లింక్డ్ ఇన్‌లో మాదిరిగా ఇన్‌జాబ్స్‌లో యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకొలేరు. లింక్డ్ ఇన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మొహక్ ష్రాఫ్ మాట్లాడుతూ అమెరికన్ కంపెనీలపై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా పలు కంపెనీలను తమ అధీనంలో ఉంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)