Namaste NRI

అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. నవంబర్ 8 నుంచి

అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా తీసుకున్న విదేశీ ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. భూభాగంపై నుంచి గానీ, విమానయానం ద్వారా గానీ వచ్చేవారిని అనుమతిస్తున్నట్లు తెలిసింది. పూర్తిగా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారికి నవంబర్‌ 8 నుంచి తమ సరిహద్దులు తెరుస్తున్నట్లు వైట్‌హౌస్‌ అసిస్టెంట్‌ కార్యదర్శి కెల్విన్‌ మునోజ్‌ తెలిపారు. నవంబర్‌ 8 నుంచి విమానయాన నిబంధనలను సడలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పొరుగున ఉన్న కెనడా, మెక్సికో పౌరులను ఈ వారం ప్రారంభం నుంచి అనుమతించిన సంగతి తెలిసిందే. టీకా తీసుకున్న వారిని త్వరలోనే దేశంలోకి అనుమతిస్తామని బైడెన్‌ ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events