బ్రిక్స్ అనుకూల దేశాలకు అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతుగా ఉండే బ్రిక్స్ సమాఖ్యలోని ఏ దేశంపైనైనా 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని, దీనికి ఎలాంటి మినహాయింపు లేదని పేర్కొన్నారు.

వాణిజ్య భాగస్వాములతో సుంకాలపై చర్చలు కొససాగిస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు గ్లోబల్ వాణిజ్యంలో మరింత అనిశ్చితిని కలిగిస్తున్నాయి. సుంకాల పెంపుపై డొనాల్డ్ ట్రంప్ గతంలో తీసుకున్న నిర్ణయానికి 90 రోజుల విరామం ప్రకటించారు. అయితే ఆ మూడు నెలల గడువు బుధవారంతో ముగియనుంది. ఎవరికి ఎంత టారిఫ్‌లు వేసిందీ వివరించే లేఖలను డజన్ల దేశాలకు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల్లో పంపనున్న క్రమంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బ్రిక్స్ గ్రూప్ అమెరికాతో ఘర్షణ కోరుకోవడం లేదని చైనా పేర్కొంది.
















