Namaste NRI

రిషబ్ శెట్టి బర్త్ డే  సందర్భంగా .. కాంతారా చాప్టర్‌-1 పోస్టర్‌ విడుదల

కన్నడ నటుడు రిషభ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంతారా చాప్టర్‌-1. గతంలో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. రిషభ్‌ శెట్టి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.  ఇతిహాసాలు పుట్టిన చోట గర్జనలు ప్రతిధ్వనిస్తాయి. కాంతార తో లక్షలాది మందిని కదిలించిన కళాఖండానికి ప్రీక్వెల్‌గా ఇది రానుంది. ఈ గొప్ప చిత్రం వెనుక ఉన్న మార్గర్శక శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అక్టోబరు 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాంతారా ఛాప్టర్‌-1 చిత్రం కోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేశారని, 500 మంది ఫైటర్లు, 3000 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో తీసిన యుద్ధ ఘట్టం భారతీయ సినిమా చరిత్రలోనే ఓ రికార్డని మేకర్స్‌ పేర్కొన్నారు. హోంబలే ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Social Share Spread Message

Latest News