
బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కన్నెర్ర చేశారు. బ్రిక్స్ కూటమిలో భారత్ కొనసాగాలనుకుం టే 10శాతం అదనపు సుంకాన్ని అమెరికాకు కట్టాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారు. వాషింగ్టన్‌లో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ బ్రిక్స్ దేశాల కూటమి డాలర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బ్రిక్స్ కూటమిలో సభ్య దేశంగా భారత్ ఎక్కువకాలం కొనసాగలేదని అన్నారు. సుంకాలు లేకుండా ప్రభుత్వానికి వాణిజ్యం చేసే హక్కు లేదు. ఇతర దేశాలు మాపై వసూలు చేసేదానికంటే చాలా తక్కువగా సుంకాన్ని విధిస్తున్నాం అని ట్రంప్ అన్నారు. కానీ ఇతర దేశాలు తమపై విధిస్తున్న ప్రతీకార సుంకాలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. బ్రిక్స్‌లోని భారత్ సహా ఇతర సభ్య దేశాలపై 10% అదనపు సుంకాన్ని విధిస్తామన్నారు.
















