మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల ప్రధాన పాత్రలు పోషిస్తున్న రూరల్ కామెడీ ఎంటైర్టెనర్ కొత్తపల్లిలో ఒకప్పుడు. ప్రవీణ పరుచూరి స్వీయ దర్శకత్వం. గోపాలకృష్ణ పరుచూరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి సమర్పకుడు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ఇది ఓ గమ్మత్తైన సినిమా. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. ద్వితీయార్ధంలో నా శైలి సున్నితమైన భావాలు తెరపై కనిపిస్తాయి. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే సినిమా ఇది అని తెలిపారు. ఈ చిత్రంలో నటించే అవకాశమిచ్చిన యూనిట్ సభ్యులందరికీ హీరో మనోజ్‌చంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంకా నటులు రవీంద్ర విజయ్, బెనర్జీ, ఫణి కూడా మాట్లాడారు. ప్రవీణ పరుచూరి, బొంగు సత్తి, ప్రేంసాగర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, మాటలు: గురుకిరణ్ బత్తుల, కెమెరా: పెట్రోస్ ఆంటోనియాడిస్, సంగీతం: మణిశర్మ, నేపథ్య సంగీతం: వరుణ్ ఉన్ని, నిర్మాణం: పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్.
















