Skip to main content

Namaste NRI

ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే సినిమా ఇది   

మనోజ్‌ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల ప్రధాన పాత్రలు పోషిస్తున్న రూరల్‌ కామెడీ ఎంటైర్టెనర్‌ కొత్తపల్లిలో ఒకప్పుడు. ప్రవీణ పరుచూరి స్వీయ దర్శకత్వం. గోపాలకృష్ణ పరుచూరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి సమర్పకుడు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ  ఇది ఓ గమ్మత్తైన సినిమా. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. ద్వితీయార్ధంలో నా శైలి సున్నితమైన భావాలు తెరపై కనిపిస్తాయి. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే సినిమా ఇది  అని తెలిపారు. ఈ చిత్రంలో నటించే అవకాశమిచ్చిన యూనిట్‌ సభ్యులందరికీ హీరో మనోజ్‌చంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంకా నటులు రవీంద్ర విజయ్‌, బెనర్జీ, ఫణి కూడా మాట్లాడారు. ప్రవీణ పరుచూరి, బొంగు సత్తి, ప్రేంసాగర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, మాటలు: గురుకిరణ్‌ బత్తుల, కెమెరా: పెట్రోస్‌ ఆంటోనియాడిస్‌, సంగీతం: మణిశర్మ, నేపథ్య సంగీతం: వరుణ్‌ ఉన్ని, నిర్మాణం: పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్‌.

Social Share Spread Message

Latest News