విశాల్ హీరోగా ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. విశాల్ 35 వర్కింగ్ టైటిల్. దుషార విజయన్ కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్నారు. రవి అరసు దర్శకుడు. 45రోజుల పాటు సాగే సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేస్తామని, యాక్షన్ ప్రధాన కథాంశంతో తెరకెక్కించబోతున్నామని మేకర్స్ తెలిపారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి హీరోలు కార్తీ, జీవా, దర్శకులు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి ఎడిటర్: ఎన్‌బీ శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్: రిచర్డ్.ఎం.నాథన్, సంగీతం: జీవి ప్రకాశ్‌కుమార్.
















