Namaste NRI

ఆ దేశాధ్యక్షుడిని అరెస్టు చేయిస్తే రూ.430 కోట్లు: అమెరికా ఆఫర్‌

అమెరికా లో డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గత కొన్నేళ్లుగా వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మడురో పై అగ్రరాజ్యం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో మడురోను అరెస్టు చేయాలని చూస్తోంది. అందుకే మడురో అరెస్టుకు సహకరిస్తే ఏకంగా 50 మిలియన్ డాలర్లు (రూ.430 కోట్లు) ముట్టజెబుతామంటూ సంచలన ప్రకటన చేసింది.

డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు ఈ రికార్డు 15 మిలియన్ డాలర్లుగా ఉంది. జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక దాన్ని 25 మిలియన్ డాలర్లకు పెంచారు. తాజాగా ఆ మొత్తాన్ని 50 మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ తెలిపారు. అమెరికాలో డ్రగ్స్‌ వ్యాప్తికి, హింసను ప్రేరేపించేందుకు నికోలస్‌ మడురో, ట్రెన్‌ డె అరాగువా, సినలో, కార్టల్‌ ఆఫ్‌ ది సన్స్‌ వంటి వాటిని వినియోగిస్తున్నారని పామ్ బాండీ ఆరోపించారు.

Social Share Spread Message

Latest News