Namaste NRI

జటాధర టీజర్‌ విడుదల రిలీజ్

సుధీర్‌బాబు, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ జటాధర. వెంకట్‌ కల్యాణ్‌, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకులు. భారతీయ పౌరాణిక ఇతివృత్తాల ఆధారంగా భారీ గ్రాఫిక్‌ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అగ్ర హీరో ప్రభాస్‌ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. లోభానికి, త్యాగానికి, దుష్టశక్తికి, దైవత్వానికి మధ్య జరిగిన పోరాటాన్ని ఆవిష్కరిస్తూ టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథానాయకుడు సుధీర్‌బాబు లోకరక్షకుడి పాత్రలో కనిపించగా, అతని విరోధిగా సోనాక్షిసిన్హా శక్తివంతమైన పాత్రలో కనిపించింది. విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. జీ స్టూడియోస్‌, ఎస్‌కేగీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News