నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్‌స్టోరీతో రూపొందుతున్న చిత్రం కన్యా కుమారి. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వంలో నిర్మించారు. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈనెల 27న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్లో హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ టీజర్ చూడగానే రైటింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. టీజర్లో వైబ్ ఉంది. కచ్చితంగా బాగుంటుందనే ఫీలింగ్ కలిగింది. చాలా ఆర్గానిక్‌గా అనిపించింది. శ్రీ చరణ్, గీత్ క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయారు. కచ్చితంగా ఇది చాలా మంచి సినిమా అవుతుందని నమ్మకం కలిగింద అని తెలిపారు.

సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. బన్నీ వాసు సపోర్ట్‌తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. సృజన్ అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు అని సమర్పకురాలు మధుశాలిని చెప్పారు. డైరెక్టర్ సృజన్ అట్టాడ మాట్లాడుతూ ఇందులో పాత్రలన్నీ కూడా రియల్ లైఫ్ నుంచి వచ్చినవే అని అన్నారు.
















