Namaste NRI

ర‌ష్యాపై వ‌త్తిడి తేవాల‌న్న ఉద్దేశంతోనే…ఇండియాపై : క‌రోలినా లివిట్

ర‌ష్యాపై వ‌త్తిడి తెచ్చేందుకే ఇండియాపై టారిఫ్ మోత మోగించిన‌ట్లు అమెరికా శ్వేత‌సౌధం  తెలిపింది. భార‌తీయ ఉత్ప‌త్తుల‌పై ట్రంప్ స‌ర్కార్ 50 శాతం దిగుమ‌తి సుంకాన్ని విధిస్తున్న విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం విష‌యంలోనూ ర‌ష్యాపై వ‌త్తిడి తెచ్చేందుకు ఇత‌ర దేశాల‌పై అద‌న‌పు టారిఫ్‌లు విధించిన‌ట్లు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్ర‌ట‌రీ క‌రోలినా లివిట్ పేర్కొన్నారు. ర‌ష్యాపై వ‌త్తిడి తేవాల‌న్న ఉద్దేశంతోనే అద‌న‌పు సుంకాలు విధించిన‌ట్లు మీడియా స‌మావేశంలో ఆమె వెల్ల‌డించారు.

ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్ధాన్ని ఆపేందుకు అధ్య‌క్షుడు ట్రంప్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశార‌ని, ఆయ‌న ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, ఇండియాపై టారిఫ్ విధించార‌ని, ఇత‌ర దేశాల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, ఈ యుద్ధం ఆగిపోవాల‌ని ఆయ‌న క్లియ‌ర్‌గా ఉన్నార‌ని ఆమె తెలిపారు.

Social Share Spread Message

Latest News