ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేశ్ కొండేటి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం వీరాభిమాని. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనేది ఉపశీర్షిక. రాంబాబు దోమకొండ దర్శకుడు. ఎస్.కె.రహ్మాన్, కంద సాంబశివరావు నిర్మాతలు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22న చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణలో మెగా అభిమానుల కోసం 70 థియేటర్లలో ఈ సినిమాను ఉచితంగా చూపించబోతున్నారు.

హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేశ్ కొండేటి మట్లాడుతూ చిరంజీవిగారు నాకు దేవుడు. ఈ సినిమాలో నటించడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు.
















