Namaste NRI

బ్యాడ్ గాళ్స్ నుంచి ఇలా చూసుకుంటానే సాంగ్‌ విడుదల

అంచల్‌గౌడ, పాయల్‌ చంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్‌ సూర్య, మొయిన్‌ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం బ్యాడ్‌ గాళ్స్‌. కానీ చాలా మంచోళ్లు అనేది ఉపశీర్షిక. మున్నా ధూలిపూడి దర్శకుడు. శశిధర్‌ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్‌ నిర్మాతలు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ఇలా చూసుకుంటానే  అంటూ సాగే ఈ పాటను రానా దగ్గుబాటి విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.

చంద్రబోస్‌ రాసిన ఈ పాటను అనూప్‌ రూబెన్స్‌ స్వరపరచగా, సిద్‌ శ్రీరామ్‌ పాడారు. నా 30రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాలో నీలి నీలి ఆకాశం  పాట ఎంత విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ పాట కంటే గొప్పగా ఈ పాట ఉంటుంది. జమ్మూకాశ్మీర్‌, మలేషియా ప్రకృతి అందాల నడుమ ఈ పాటను చిత్రీకరించాం  అని దర్శకుడు చెప్పారు.  ఈ చిత్రానికి కెమెరా: ఆర్లి గణేశ్‌, నిర్మాణం: ప్రశ్విత ఎంటైర్టెన్మెంట్స్‌, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్‌, ఎన్‌వీఎల్‌ క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News