Namaste NRI

సౌత్ ఆఫ్రికాలో సేవా కార్యక్రమాలు : మహేష్ బిగాల

బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ  కో ఆర్డినేటర్ మహేష్ బిగాలను ఎన్‌ఆర్‌ఐ  సౌత్ ఆఫ్రికా కోర్ టీమ్ హైదరాబాద్‌లో కలిసింది.  సౌతాఫ్రికాలోని ప్రవాస తెలంగాణ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల విజయవంతమైన ఘట్టాలను టీమ్ సమీక్షించింది. ఈ భేటీలో బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు నేతృత్వంలోని కోర్ కమిటీ టీమ్ కృషిని మహేష్ బిగాల అభినందించారు. భవిష్యత్తులో సౌత్ ఆఫ్రికాలో మరింత ఉత్సాహంతో, విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. అదనంగా మహేష్ బిగాల ప్రతీ టీమ్ సభ్యుడిని ప్రత్యేకంగా అభినందించారు.

రాబోయే రోజుల్లో సౌత్ ఆఫ్రికాలో చేపట్టనున్న కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. 25వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని కేటీఆర్ సందర్శనకు సంబంధించి ప్రణాళికలు చర్చకు వచ్చాయి. భేటీ సందర్భంగా కోర్ కమిటీ సభ్యులు మహేష్ బిగాలకు అన్ని సహకారాలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ప్రణాళికలు రూపొందించారు.  ఈ భేటీలో శ్రీధర్ రెడ్డి అగ్గనగారి,   విష్ణు జయ్ గుండా, వెంకట్రావు తల్లపల్లి తదితర కోర్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News