మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం లిటిల్ హార్ట్స్. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా ఈ నెల 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ శివానీ నాగరం విలేకరులతో ముచ్చటించారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ సెలక్టివ్‌గా వెళ్లాలని వెయిట్ చేశా. మంచి కంటెంట్ ఉన్న కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు లిటిల్ హార్ట్స్ ప్రాజెక్ట్ నా దగ్గరకొచ్చింది. డైరెక్టర్ సాయిమార్తాండ్ ఈ కథ చెప్పినప్పుడు ఎైగ్జెటింగ్‌గా అనిపించింది. ప్రతి పాత్రనూ డిజైన్ చేసిన తీరు సూపర్. నా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు లో లవ్‌స్టోరీతోపాటు ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ఈ సినిమా అలా కాదు. ఇది కంప్లీట్ లైట్ హార్టెడ్ మూవీ. కాలేజీ రోజుల్లో ఉండే ఫన్‌తో ఈ సినిమా సాగుతుంది. యూత్‌కి విపరీతంగా నచ్చే సినిమా ఇది అని అన్నారు.

ఇందులో నా పేరు కాత్యాయని. ప్రతి అమ్మాయి తమతో తాము పోల్చుకునేలా నా పాత్ర ఉంటుంది. అఖిల్, కాత్యాయని స్నేహం, ప్రేమ, ప్రతి ఒక్కరి కాలేజ్ రోజుల్ని గుర్తు చేస్తుంది. ఈ సినిమా థియేటర్‌కోసం చేసిందే అయినా, బన్నీ వాస్, వంశీ నందిపాటి ఎంటర్ అయ్యాక, సినిమా రేంజ్ మారింది. ఈటీవీ విన్ రిలీజ్ చేస్తున్న తొలి థియేట్రికల్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం అని తెలిపారు.
















