Namaste NRI

అమెరికాలో మీ పెట్టుబడులు ఎంత? : డొనాల్డ్ ట్రంప్  

అమెరికాలో పెట్టుబడులే లక్ష్యంగా పలువురు టెక్‌ దిగ్గజాలకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇచ్చారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈఓలు హాజరయ్యారు. డొనాల్డ్ ట్రంప్  ఆ దేశంలోని టెక్‌ కంపెనీల అధిపతులను సూటిగా ప్రశ్నించారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్‌ అనంతరం ఈ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. 

 విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఇక చాలు అని, ఇకపై స్వదేశానికి రావాలని చెప్పారు. యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ను ఉద్దేశించి అమెరికాలో యాపిల్‌ పెట్టుబడులు ఎంత ఉండబోతున్నాయి? ఇంత కాలం మీరు బయట పెట్టింది చాలు. ఇక స్వదేశానికి తిరిగి రండి. ఎంత పెట్టుబడి పెడతారు? అని ప్రశ్నించారు. టిమ్‌ స్పందిస్తూ..600 బిలియన్‌ డాలర్లు అని చెప్పారు. మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ 600 బిలియన్‌ డాలర్లు, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ 250 బిలియన్‌ డాలర్లు, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ఏటా 80 బిలియన్‌ డాలర్లు పెడతామని చెప్పడంతో ట్రంప్‌ మురిసిపోయారు.

Social Share Spread Message

Latest News