
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటిస్తున్న చిత్రం కె-ర్యాంప్. జైన్స్ నాని దర్శకత్వం. ఈ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి కలలే కలలే అనే పాటను విడుదల చేశారు. చైతన్య భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటను భాస్కరభట్ల రచించారు. కపిల్ కపిలన్ ఆలపించారు. కలలే కలలే కనులకు నువు కనబడి కలలే, కథలే మొదలే వివరములే తెలియాలే, నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే, నాక్కొంచెం చోటైనా లేకుందే అంటూ చక్కటి లవ్‌ఫీల్‌తో ఈ పాట సాగింది. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, రచన-దర్శకత్వం: జైన్స్ నాని.















