
ప్రపంచ కుబేరుడిగా సాఫ్ట్వేర్ దిగ్గజం, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ నిలిచారు. ఎలాన్ మస్క్‌ను దాటి ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు. ఒరాకిల్ షేర్లు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దాంతో ఎలిసన్ సంపద అనేక బిలియన్ డాలర్లు పెరగడంతో ఎలాన్ మస్క్‌ను దాటేసి ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. ఎలిసన్ సంపద ఇప్పుడు 393 బిలియన్ డాలర్లు. ఈ మొత్తం సంపద ఎలాన్ మస్క్ కంటే ఎనిమిది బిలియన్ డాలర్లు ఎక్కువ. నాలుగేళ్ల కింద ఎలాన్ మస్క్ తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ప్రస్తుతం ఆయన నికర విలువ 385 బిలియన్ డాలర్లు. మంగళవారం వరకు మస్క్ ప్రధాన సంస్థ అయిన టెస్లా షేర్లు 14శాతం తగ్గాయి.
















