
దర్శకుడు చందూ మొండేటి తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నాడు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం వాయుపుత్ర. మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో 3D యానిమేషన్‌గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన మోషన్ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. మన చరిత్ర ఆత్మలోంచి, మన ఇతిహాసాల పుటల నుంచి పుట్టిన ఒక అమర పురాణగాథ అంటూ చిత్రబృందం ఆ పోస్టర్‌ను పంచుకుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
















