Namaste NRI

భారత్‌తో పాటు చైనాపై కూడా ఇదే తరహాలో :  డోనాల్డ్‌ ట్రంప్‌

భారత్‌పై ఇప్పటికే సుంకాలను విచ్చలవిడిగా పెంచిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌పై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించాలని యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) అధికారులను ట్రంప్‌ కోరినట్లు సమాచారం. భారత్‌తో పాటు చైనాపై కూడా ఇదే తరహాలో సుంకాలు విధించాలని అడిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్‌ అమెరికన్‌, ఈయూ అధికారులు వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో డోనాల్డ్‌ ట్రంప్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్‌, చైనాపై 100 శాతం సుంకం విధించాలని సూచించినట్లు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News