గత నాలుగైదు రోజులుగా అట్టుడికిన నేపాల్ లో కొత్త అధ్యాయం మొదలైంది. ఆ దేశ చరిత్రలో తొలి ప్రధాన మంత్రిగా మాజీ జస్టిస్ సుశీల కర్కి బాధ్యతలు చేపట్టారు. తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన ఆమె రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత శీతల్ నివాసంలో అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆమెతో పదవీ ప్రమాణం చేయించారు.

తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ఎంపికైన తర్వాత ప్రెసిడెంట్ రామ్ చంద్ర పౌడెల్ పార్లమెంట్ ను రద్దు చేశారు. దాంతో, తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరేందుకు మార్గం సుగమం అయింది. రాష్ట్రపతి భవన్ లో అధ్యక్షుడు పౌడెల్ కర్కితో ప్రమాణ స్వీకారం చేయించారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చిలో నేపాల్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగునున్నాయి. అప్పటివరకూ సుశీల నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగనుంది.
















