Namaste NRI

భారత్ పై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు… ప్రపంచంలోనే

భారత్ పై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అమెరికాతో అత్యున్నత సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు. భారత్లో అమెరికా రాయబారిగా సెర్గీ గోర్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే సెర్గీ గోర్ అభ్యర్థిత్వాన్ని సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెనెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా సెర్గీ గోర్ ను రూబియో పరిచయం చేస్తూ ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పాత్ర చాలా ముఖమైందని తెలిపారు. ప్రస్తుతం భారత్- అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం సహా ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఆయన ప్రస్తావించారు. భారత్ తో సంబంధాల విషయంలో మనం కొంత అసాధారణ స్థితిలో ఉన్నామని, దీనిపై వారితో కలిసి పని చేసి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

Social Share Spread Message

Latest News